| కీర్తనలు | త్యాగరాజు | ఎవరికై యవతారమెత్తితివివో - యిపుడైన తెలుపవయ్య |
| దేవమనోహరి - చాపు |
| పల్లవి: |
| ఎవరికై యవతారమెత్తితివివో? యిపుడైన తెలుపవయ్య రామయ్య నీ ॥ఎవరికై॥ |
| అను పల్లవి: |
| అవనికి రమ్మని పిలిచిన మహరా జెవఁడో వానికి మ్రొక్కెద రామ ॥ఎవరికై॥ |
| చరణము(లు): |
| వేదవర్ణ నీయమౌ నామముతో విధి రుద్రులకు మేల్మియగు రూపముతో మోద సదనమగు పటు చరితముతో మునిరాజ వేషియై త్యాగరాజనుత! ॥ఎవరికై॥ |