| గాంగేయభూషణి - దేశాది |
| పల్లవి: |
| ఎవ్వరే రామయ్య నీ సరి ఎ.. |
| అను పల్లవి: |
రవ్వకుఁ దావులేక సుజనులను
రాజిగ రక్షించే వా రె.. |
| చరణము(లు): |
పగవానికి సోదరుఁడని యెంచక
భక్తినెఱిగిఁ లంకాపట్టణ మొసగఁగా
నగధర సురభూసురపూజిత వర
నాగశయన త్యాగరాజవినుత సరి ఎ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - evvaree raamayya nii sari ( telugu andhra )