| కీర్తనలు | త్యాగరాజు | ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ! |
| అసావేరి - ఆది |
| పల్లవి: |
| ఏ పనికో జన్మించితినని నన్నెంచవలదు, శ్రీరామ! నే ॥నే॥ |
| అను పల్లవి: |
| శ్రీపతి! శ్రీరామచంద్ర! నీ చిత్తమునకు తెలియదా? ॥ఏ॥ |
| చరణము(లు): |
| వాల్మీకాది మునులు, నరులు నిన్ను వర్ణించిరి నాయాశ దీరునా! మేల్మియై యుండును, సద్భక్తులు మెచ్చుదురే? త్యాగరాజనుత! ॥ఏ॥ |