| కీర్తనలు | త్యాగరాజు | ఏటి జన్మమిది హా ఓ రామ |
| వరాళి - చాపు |
| పల్లవి: |
| ఏటి జన్మమిది హా ఓ రామ ఏ.. |
| అను పల్లవి: |
| ఏటి జన్మమిది యెందుకుఁ గలిగెనో యెంతని సైరింతు హా ఓ రామ ఏ.. |
| చరణము(లు): |
| సాటిలేని మారకోటి లావణ్యుని మాటిమాటికిఁ జూచి మాటలాడని తన కే.. |
| సారెకు ముత్యాల హార మురము పాలు గారు మోమును గన్నులారఁ జూడని తన కే.. |
| ఇంగితమెరిగని సంగీతలోలుని పొంగుచుఁ దనివార గౌగలించని తన కే.. |
| సాగరశయనుని త్యాగరాజనుతుని వేగమె కూడక వేగేని హృదయము ఏ.. |