| కీర్తనలు | త్యాగరాజు | ఏమని మాట్లాడితివో రామ |
| తోడి - ఆది |
| పల్లవి: |
| ఏమని మాట్లాడితివో రామ ఎవరి మనసుకే విధమో దెలిసి ఏ.. |
| అను పల్లవి: |
| మామ మరుదులనుజులు తల్లిదండ్రులు భామలు పరిజనులు స్వవశమౌట కే.. |
| చరణము(లు): |
| రాజులు మునులు సురారులు వర ది గ్రాజులు మరి శూరులు శశధరదిన రాజులు లోబడి నడువను త్యాగ రాజవినుత నయభయముగ ముద్దుగ ఏ.. |