| కీర్తనలు | త్యాగరాజు | ఏహి త్రిజగదీశ! శంభో! మాం పాహి పంచనదీశ |
| సారంగ - చాపు |
| పల్లవి: |
| ఏహి త్రిజగదీశ! శంభో! మాం పాహి పంచనదీశ ॥ఏహి॥ |
| అను పల్లవి: |
| వాహినీశ రిపునుత శివ సాంబ దేహి త్వదీయ కరాబ్జావలంబం ॥ఏహి॥ |
| చరణము(లు): |
| గంగాధర ధీర నిర్జర రిపు - పుంగవ సంహార మంగళకరపురభంగ విధృత సుకు రం గాప్త హృదయాబ్జభృంగ శుభాంగ ॥ఏహి॥ |
| వారనాజినచేల భవనీరధి తరణ సురపాల క్రూర లోకాభ్రసమీరణ శుభ్రశ రీర మామకాఘహర పరాత్పర ॥ఏహి॥ |
| రాజశేఖర కరుణాసాగర నగ రాజాత్మజా రమణ రాజరాజ పరిపూజిత పద త్యాగ రాజరాజ వృషరాజాధిరాజ ॥ఏహి॥ |