| కీర్తనలు | త్యాగరాజు | ఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెద వేరా? నే నీకు వేరా? |
| ఆరభి - చాపు |
| పల్లవి: |
| ఓ రాజీవాక్ష ఓరజూపుల జూచెద వేరా? నే నీకు వేరా? ॥ఓ రాజీవాక్ష॥ |
| అను పల్లవి: |
| నేరని నాపై నేరము లెంచినఁ గారాదని పల్కెడు వారు లేని నన్ను ॥ఓ రాజీవాక్ష॥ |
| చరణము(లు): |
| మక్కువతో నిను మ్రొక్కిన జనులకు దిక్కు నీవని యతి గ్రక్కున బ్రోతువని యెక్కువ సుజనుల యొక్క మాటలు విని చక్కని శ్రీరామ దక్కితి గదరా ॥ఓ రాజీవాక్ష॥ |
| మితి మేరలేని ప్రకృతిలోన దగిలి నే మతిహీనుఁడై సన్నుతి సేయనేరక బతిమాలి నీవే గతియని నెర న మ్మితిగాని నిను మరచితినా సంతతము ॥ఓ రాజీవాక్ష॥ |
| మావర సుగుణ ఉమావర సన్నుత దేవర దయజేసి బ్రోవగ రాగా పావన భక్తజనావన మహాను భావ త్యాగరాజ భావిత యింక నన్ను ॥ఓ రాజీవాక్ష॥ |