| కీర్తనలు | త్యాగరాజు | కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు |
| తోడి - ఆది |
| పల్లవి: |
| కద్దనువారికి కద్దు కద్దని మొఱల నిడు పెద్దల మాటలు నే డబద్ధ మౌనో ॥క॥ |
| అను పల్లవి: |
| అద్దంపుఁ జెక్కిళ్లచే ముద్దుగారు మోముఁ జూడ బుద్ధి గలిగినట్టి మావద్ద రావదేమిరా ॥క॥ |
| చరణము(లు): |
| నిద్దుర నిరాకరించి ముద్దుగాఁ దంబురఁ బట్టి శుద్ధమైన మనసుచే సుస్వరముతోఁ బద్దు తప్పక భజియించే భక్తపాలనముసేయు తద్దయశాలివి నీవే త్యాగరాజ సన్నుత ॥క॥ |