| బిలహరి - దేశాది |
| పల్లవి: |
| కనుగొంటిని శ్రీరాముని నేఁడు ॥క॥ |
| అను పల్లవి: |
ఇనకులమందు ఇంపుగాను బుట్టిన
ఇలలోన సీతానాయకుని నేఁడు ॥క॥ |
| చరణము(లు): |
భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువఁ
బవమానసుతుఁడు పాదములఁ బట్ట
ధీరులైన సుగ్రీవప్రముఖులు
వినుతిసేయ త్యాగరాజనుతుని నేఁడు ॥క॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kanugoMTini shriiraamuni nee.rDu ( telugu andhra )