| నాయకి - రూపకం |
| పల్లవి: |
| కనుగొను సౌఖ్యము, కమలజుకైనఁ గల్గునా ॥కనుగొను॥ |
| అను పల్లవి: |
| దనుజ వైరియగు రాముని దయ గల్గిన నతని వినా ॥కనుగొను॥ |
| చరణము(లు): |
తనువొకచో మనసొకచో దగిన వేషమొకచో నిడి
జనుల నేచువారికి జయమౌనే త్యాగరాజు ॥కనుగొను॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kanugonu saukhyamu, kamalajukaina galgunaa ( telugu andhra )