| కీర్తనలు | త్యాగరాజు | కనులు తాకని పరకాంతల మనసెటులో రామ |
| కల్యాణ వసంత - రూపక |
| పల్లవి: |
| కనులు తాకని పరకాంతల మనసెటులో రామ క.. |
| అను పల్లవి: |
| ననబోణులపై నేరమన నోరేమి రామ క.. |
| చరణము(లు): |
| ఘోరభూతపతినిజూచి దారుకారణ్యసతులు మేరమీఱి భువిని యపదూరు గల్గజేసిరే క.. |
| మన మోహనానంద మదచకోరనయన కుందర దన చంద్రవదన సుందరాంగ త్యాగ రాజవినుత క.. |