| కీర్తనలు | త్యాగరాజు | కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే |
| దేవమనోహరి - దేశాది |
| పల్లవి: |
| కన్నతండ్రి నాపై కరుణమానకే గాసితాళనే ॥క॥ |
| అను పల్లవి: |
| నిన్నసేయుపనులు నేఁడుగాక వే రెన్నలేదనుచు వేమాఱులకు ॥క॥ |
| చరణము(లు): |
| ఎదురు తాననే ఇంగితం బెఱిఁగి చెదరనీక పంచేంద్రియ మణంచి నిన్ వదలలేని ధైర్యశాలి గాదని మదనకోటిరూప త్యాగరాజ నుత ॥క॥ |