| దేవగాంధారి - ఆది |
| పల్లవి: |
| కరుణాసముద్ర, నను కావవే, శ్రీరామభద్ర ॥కరుణా॥ |
| అను పల్లవి: |
| శరణాగత హృచ్ఛిద్ర శమన నిర్జిత నిద్ర ॥కరుణా॥ |
| చరణము(లు): |
నాపాపము నాతో నుండిన
శ్రీప నీ బిరుదు కేమి బ్రతుకు
యే పాపుల శాపమో
యెందు కీచలము త్యాగరాజనుత ॥కరుణా॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - karuNaasamudra, nanu kaavavee, shriiraamabhadra ( telugu andhra )