| కీర్తనలు | త్యాగరాజు | కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా |
| కుంతలవరాళి - దేశాది |
| పల్లవి: |
| కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమనలేదా క.. |
| అను పల్లవి: |
| ఇలను వెలయు వర వృష రాజుల కటు కులరుచి తెలియు చందముగా నీ క.. |
| చరణము(లు): |
| దారసుతులకై ధనములకై యూరు పేరులకై బహు పెద్దతనముకై సారెకు భక్తవేసముకొనువారికి తారకనామ శ్రీ త్యాగరాజార్చిత క.. |