| కీర్తనలు | త్యాగరాజు | కాసిచ్చెడిదే గొప్పాయనురా - కలిలో రాజులకు |
| గౌళిపంతు - ఆది |
| పల్లవి: |
| కాసిచ్చెడిదే గొప్పాయనురా - కలిలో రాజులకు ॥కా॥ |
| అను పల్లవి: |
| హరి దాసులు సేవింపరనుచు ప్రభువులు దయ మానిరి, పర మెంచక పోయిరి ॥కా॥ |
| చరణము(లు): |
| రాజాంగము కొరకు నాల్గుజాతుల రక్షణ పరసుఖమో? రాజసులై సన్మార్గ మెఱుఁగక పరాకు సేయ ఘనమో? ఆజన్మము గొలిచి విప్రవరుల కానందము గలదో? త్యాగ రాజవినుత! నీ మాయగాని నీరజనయన! సుజనాఘ విమోచన! ॥కా॥ |