| ఛాయాతరంగిణి - ఆది |
| పల్లవి: |
| కృప జూచుటకు వేళరా రామా ॥కృప॥ |
| అను పల్లవి: |
అపరాధముల నోర్వవశమా
యన బోకవే సరివారలలో ॥కృప॥ |
| చరణము(లు): |
పరమార్థమౌ మార్గమెఱుఁగరు
ప్రభువులెల్ల నీచ సేవకులురా!
పరలోక భయ మెంత గానరు
వర త్యాగరాజ హృత్సదన! ॥కృప॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - kR^ipa juuchuTaku veeLaraa raamaa ( telugu andhra )