| కీర్తనలు | త్యాగరాజు | కొనియాడెడి నాయెడ దయ వెలకు |
| కోకిలధ్వని - ఆది |
| పల్లవి: |
| కొనియాడెడి నాయెడ దయ వెలకు గొనియాడెదవు సుమీ రామ నిను ॥కొని॥ |
| అను పల్లవి: |
| అనయము నీ మనసును గనిపొంగుచు అంతరమున నతి ప్రేమతో నిను ॥కొని॥ |
| చరణము(లు): |
| వింత వింత మతములలోఁ జొరబడి వెతఁజెందగ లేఁడను నీ మనసు కింత దెలిసి త్యాగరాజ సన్నుత యే వేళను నీ శుభ చరితమును ॥కొని॥ |