| భైరవి - ఆది |
| పల్లవి: |
| కొలువై యున్నాఁడే కోదండపాణి కొ.. |
| అను పల్లవి: |
తొలికర్మమణఁగఁ జూతాము రారే!
తోయజారి రోహిణిఁ గూడినరీతి కొ.. |
| చరణము(లు): |
మనసు రంజిల్ల సురసతులు
అణిమాదులు కొలువ వేయివన్నె
కనకశలాకను గేరు సీతా
కాంతతోను త్యాగరాజ వినుతుఁడు కొ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - koluvai yunnaa.rDee koodaMDapaaNi ( telugu andhra )