| ముఖారి - ఆది |
| పల్లవి: |
క్షీణమై తిరుగ జన్మించే
సిద్ధిమానరా ఓ మనసా క్షీ.. |
| అను పల్లవి: |
గీర్వాణ నాటకాలంకార వేద పు
రాణ యజ్ఞజపతపాదుల ఫలములు క్షీ.. |
| చరణము(లు): |
ఏది చేసిన జగన్నాథుఁడు శిరమున
హృదయమున వహించి
పదిలమైన సత్పదము నొసంగే బాట
త్యాగరాజవినుతుని భజనరా క్షీ.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - xiiNamai tiruga janmiMchee ( telugu andhra )