| గానమూర్తి - దేశాది |
| పల్లవి: |
గానమూర్తే శ్రీకృష్ణవేణు
గానలోల త్రిభువనపాల పాహి గా.. |
| అను పల్లవి: |
మానినీమణి శ్రీ రుక్మిణి
మానసాపహార మారజనక దివ్య గా.. |
| చరణము(లు): |
నవనీతచోర నందసత్కిశోర
నరమిత్రధీర నరసింహ శూర
నవమేఘతేజ నగజాసహజ
నరకాంతకాజ నరత్యాగరాజ గా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - gaanamuurtee shriikR^ishhNaveeNu ( telugu andhra )