| కీర్తనలు | త్యాగరాజు | గ్రహబలమేమి శ్రీరామానుగ్రహబలమే బలము |
| రేవగుప్తి - దేశాది |
| పల్లవి: |
| గ్రహబలమేమి శ్రీరామాను, గ్రహబలమే బలము ॥గ్రహ॥ |
| అను పల్లవి: |
| గ్రహబలమేమి తేజోమయ వి గ్రహమును ధ్యానించు వారికి నవ ॥గ్రహ॥ |
| చరణము(లు): |
| గ్రహపీడల పంచపాపముల నాగ్రహములు గల కామాదిరిపుల నిగ్రహము జేయు హరిని భజించు త్యాగరాజునికి రసికా గ్రేసరులకు ॥గ్రహ॥ |