| కీర్తనలు | త్యాగరాజు | చింతిస్తున్నాఁడే యముఁడు |
| ముఖారి - ఆది |
| పల్లవి: |
| చింతిస్తున్నాఁడే యముఁడు ॥చింతి॥ |
| అను పల్లవి: |
| సంతతము సుజనులెల్ల సద్భజన చేయుటఁజూచి ॥చింతి॥ |
| చరణము(లు): |
| శూల పాశ ధృత భట జాలములఁ జూచి మఱి మీ కోలాహలము లుడుగు కాల మాయెనే యనుచు ॥చింతి॥ |
| వారధి శోషింప జేయు క్రూర కుంభజుని రీతి ఘోర నరకాదుల నణచు తారక నామమును దలచి ॥చింతి॥ |
| దారి దెలియలేక తిరుగు వారలైన చాలుననిన సారమని త్యాగరాజ సంకీర్తనము బాడెదరని ॥చింతి॥ |