| కీర్తనలు | త్యాగరాజు | చూతాము రారే సుదతులార రంగపతిని |
| ఆరభి - రూపక |
| పల్లవి: |
| చూతాము రారే సుదతులార రంగపతిని జూ.. |
| అను పల్లవి: |
| సీతాపతి పూజ్యుఁడట శృంగార శేఖరుఁడట చూ.. |
| చరణము(లు): |
| సరిగంచు శాలువట చౌకట్ల పోగులట పరవంపుప్రాయమట పరమాత్ముడట రంగని చూ.. |
| ముఖనిర్జిత చంద్రుఁడట ముద్దుమాటలాడునట సుఖమొసంగి బ్రోచునట సుందరాంగుఁడట రంగని చూ.. |
| ఆగమ సంచారుఁడట అఖిలజగత్పాలుడట త్యాగరాజ సన్నుతుడఁట తరుణులార రంగ పతిని చూ.. |