| కుంతలవరాళి - దేశాది |
| పల్లవి: |
| చెంతనే సదా యుంచుకోవయ్య ॥చెంతనె॥ |
| అను పల్లవి: |
మంతు కెక్కు శ్రీ మంతుఁడౌ హను
మంతు రీతిగ శ్రీకాంత! ॥చెంతనె॥ |
| చరణము(లు): |
తలచిన పనులను నే దెలిసి
తలతో నడచి సంతసిల్లుదురా
పలుమారు బల్క బనిలేదు రామ!
భరతునివలె త్యాగరాజనుత ॥చెంతనె॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - cheMtanee sadaa yuMchukoovayya ( telugu andhra )