| అఠాణ - ఆది |
| పల్లవి: |
| చెడెడు బుద్ధి మానురా ॥చెడెడు॥ |
| అను పల్లవి: |
| ఇడెడు పాత్ర మెవరో జూడరా ॥చెడెడు॥ |
| చరణము(లు): |
భూవాసికిఁ దగు ఫలము గల్గునని
బుధులు బల్క వినలేదా మనసా
శ్రీవాసుదేవ సర్వమనుచును
చింతించర త్యాగరాజ వినుతుని ॥చెడెడు॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - cheDeDu buddhi maanuraa ( telugu andhra )