| కీర్తనలు | త్యాగరాజు | జయమంగళం నిత్య శుభమంగళం |
| ఘంటా - జంప |
| పల్లవి: |
| జయమంగళం నిత్య శుభమంగళం ॥జ॥ |
| కరుణారసాక్షాయ కామారివినుతాయ తరుణారుణాతి సుందరపదాయ నిరుపమశరీరాయ నిఖిలాగమచరాయ సురవినుతచరితాయ సువ్రతాయ ॥జ॥ |
| కుందసుమరదనాయ కుంభజసుగేయాయ మందరాగధరాయ మాధవాయ కందర్పజనకాయ కామితసుఫలదాయ బృందారకారాతిభీకరాయ ॥జ॥ |
| సర్వలోకహితాయ సాకేతసదనాయ నిర్వికారాయ మానితగుణాయ సార్వభౌమాయ పోషితత్యాగరాజాయ నిర్వాణఫలదాయ నిర్మలాయ ॥జ॥ |