| కీర్తనలు | త్యాగరాజు | జానకీ నాయక నీకు జయ మంగళం |
| ధన్యాసి - ఆది |
| పల్లవి: |
| జానకీ నాయక నీకు జయ మంగళం నృప సూన సందరమునకు శుభమంగళం హరే ॥జానకీ॥ |
| చరణము(లు): |
| ఫాలమునకు నీదు కపాలమునకు మంగళం నీలవర్ణ నీ పలు వజ్రాలమునకు మంగళం ॥జానకీ॥ |
| యౌవనమునకు చిరునవ్వునకు మంగళం దువ్విన యలకలమీది పువ్వులకు మంగళం ॥జానకీ॥ |
| మాటలకు రత్నాల కిరీటమునకు మంగళం నాటక సూత్రధార నీ తేటకండ్లకు మంగళం ॥జానకీ॥ |
| బాణమునకు కుసుమ బాణజనక మంగళం జాణతనమునకు లోక త్రాణమునకు మంగళం ॥జానకీ॥ |
| ఉంగరమునకు నీ దృష్టాంగమునకు మంగళం పొంగుచు పదముల నుండు గంగకును మంగళం ॥జానకీ॥ |
| నీ గుణజాలమునకు నిత్య శుభ మంగళం నాగశయన పాలిత త్యాగరాజ మంగళం ॥జానకీ॥ |