| ధన్యాసి - ఆది |
| జానకీనాయక నీకు - జయమంగళం నృప |
| సూన సుందరమునకు - శుభమంగళం హరే ॥జా॥ |
| ఫాలమునకు నీదు క - పోలమునకు మంగళం |
| నీలవర్ణ నీ పలు వ - జ్రాలమునకు మంగళం ॥జా॥ |
| యౌవనమునకు చిరు - నవ్వునకు మంగళం |
| దువ్విన యలకలమీది - పువ్వులకు మంగళం ॥జా॥ |
| మాటలకు రత్నాల కి - రీటమునకు మంగళం |
| నాటకసూత్రధార నీ - తేటకండ్లకు మంగళం ॥జా॥ |
| బాణమునకు కుసుమ - బాణజనక మంగళం |
| జాణతనమునకు లోక - త్రాణమునకు మంగళం ॥జా॥ |
| ఉంగరమునకు నీ ద - ష్టాంగమునకు మంగళం |
| పొంగుచు పదములనుండు - గంగకును మంగళం ॥జా॥ |
| నీగుణజాలమునకు - నిత్య శుభమంగళం |
| నాగశయనపాలిత - త్యాగరాజ మంగళం ॥జా॥ |