| శుద్ధసీమంతిని - ఆది |
| పల్లవి: |
జానకీరమణ భక్త పారి
జాత పాహి సకలలోక శరణ జా.. |
| అను పల్లవి: |
గానలోల ఘనతమాలనీల
కరుణాలవాల సుగుణశీల జా.. |
| చరణము(లు): |
రక్తనళినదళనయన నృపాల
రమణీయానన ముకురకపోల
భక్తిహీనజన మదగజజాల
పంచవదన త్యాగరాజపాల జా.. |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - jaanakiiramaNa bhakta paari ( telugu andhra )