| కీర్తనలు | త్యాగరాజు | జో జో రామ ఆనందఘన జో జో జో రామ |
| రీతిగౌళ - ఆది |
| జో జో రామ ఆనందఘన జో జో జో రామ ॥జో॥ |
| జో జో దశరథబాలరామ - జో జో భూజాలోల రామ ॥జో॥ |
| జో జో రఘుకులతిలక రామ - జో జో కుటిలతరాలక రామ ॥జో॥ |
| జో జో నిర్గుణరూప రామ - జో జో సుగుణకలాప రామ ॥జో॥ |
| జో జో రవిశశినయన రామ - జో జో ఫణివరశయన రామ ॥జో॥ |
| జో జో మృదుతరభాష రామ - జో జో మంజులవేష రామ ॥జో॥ |
| జో జో త్యాగరాజార్చిత రామ - జో జో భక్తసమాజ రామ ॥జో॥ |