| కీర్తనలు | త్యాగరాజు | తనవారి తనము లేదా? తారకాధిపానన వాదా? |
| బేగడ - దేశాది |
| పల్లవి: |
| తనవారి తనము లేదా? తారకాధిపానన వాదా? ॥తన॥ |
| అను పల్లవి: |
| ఇనవంశ రాజుల కీగుణము లెన్నడైన గలదా నాదుపై ॥తన॥ |
| చరణము(లు): |
| పేరపేర బిల్చి హారములు ప్రేమ మీర మీ దొసగ లేదా నాదుపై ॥తన॥ |
| అలనాడు అన్న మారగించు వేళ బలు వానరుల పంక్తినుంచ లేదా ॥తన॥ |
| రామ రామ రామ రచ్చ సేయకవే తామసంబ దేల? త్యాగరాజనుత ॥తన॥ |