| కీర్తనలు | త్యాగరాజు | తవదాసోహం, తవదాసోహం, తవదాసోహం దాశరథే |
| పున్నాగవరాళి - ఆది |
| పల్లవి: |
| తవదాసోహం తవదాసోహం తవదాసోహం దాశరథే ॥తవ॥ |
| చరణము(లు): |
| వరమృదుభాష విరహిత దోష నరవర వేష దాశరథే ॥తవ॥ |
| సరసిజనేత్ర పరమపవిత్ర సురపతిమిత్ర దాశరథే ॥తవ॥ |
| నిన్ను కోరితిరా నిరుపమశూర నన్నేలుకోరా దాశరథే ॥తవ॥ |
| మనవిని వినుమా మరవ సమయమా ఇనకుల ధనమా దాశరథే ॥తవ॥ |
| ఘనసమనీల మునిజనపాల కనక దుకూల దాశరథే ॥తవ॥ |
| ధర నీ వంటి దైవము లేడంటి శరణను కొంటి దాశరథే ॥తవ॥ |
| ఆగమవినుత రాగవిరహిత త్యాగరాజనుత దాశరథే ॥తవ॥ |