| కీర్తనలు | త్యాగరాజు | తులసీ బిల్వ మల్లికాది జలజ సుమ పూజల గైకొనవే |
| కేదారగౌళ - ఆది |
| పల్లవి: |
| తులసీ బిల్వ మల్లికాది జలజ సుమ పూజల గైకొనవే ॥తులసీ॥ |
| అను పల్లవి: |
| జలజాసన సనకాది కరార్చిత జలదాభ సునాభ విభాకర హృ జ్జలేశ హరిణాంక సుగంధ ॥తులసీ॥ |
| చరణము(లు): |
| ఉరమున ముఖమున శిరమున నేత్రమున కరమున భుజమున చరణ యుగంబున కరుణతో నెనరుతో పరమానందముతో నిరతమును శ్రీత్యాగరాజ నిరుపాధికుఁడై యర్చించు ॥తులసీ॥ |