| కీర్తనలు | త్యాగరాజు | తెరతీయగ రాదా లోని |
| గౌళిపంతు - ఆది |
| పల్లవి: |
| తెరతీయగ రాదా లోని తిరుపతి వెంకటరమణ మత్సరమను ॥తె॥ |
| అను పల్లవి: |
| పరమపురుష ధర్మాదిమోక్షముల పారదోలుచున్నది నాలోని ॥తె॥ |
| చరణము(లు): |
| ఇరవొందగ భుజియించు సమయమున ఈగ తగులురీతి యున్నది హరిధ్యానము సేయువేళ చిత్తము అంత్యజువాడకుఁ బోయినట్లున్నది ॥తె॥ |
| మత్స్యము ఆకలిగొని గాలముచే మగ్నమైనరీతి యున్నది అచ్చమైన దీప సన్నిధిని మరు గిడఁబడి చెఱిచినట్లున్నది ॥తె॥ |
| వాగురయని తెలియక మృగ గణములు వచ్చి తగులురీతి యున్నది వేగమే నీ మతము ననుసరించిన త్యాగరాజనుత! మదమత్సరమను ॥తె॥ |