| కీర్తనలు | త్యాగరాజు | తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా |
| పూర్ణచంద్రిక - ఆది |
| పల్లవి: |
| తెలిసి రామచింతనతో నామము సేయవే ఓ మనసా ॥తె॥ |
| అను పల్లవి: |
| తలఁపు లన్ని నిలిపి నిమిషమైన తారకరూపుని నిజతత్త్వములను ॥తె॥ |
| చరణము(లు): |
| రామా యన చపలాక్షులపేరు కామాదుల పోరువారు వీరు రామా యన బ్రహ్మమునకుఁ బేరు ఆ మానవ జననార్తులు దీఱు ॥తె॥ |
| అర్క మనుచు జిల్లేడు తరుపేరు మర్కట బుద్ధులెట్లు దీఱు అర్కుడనుచు భాస్కరునికి పేరు కు తర్కమనే అంధకారము తీఱు ॥తె॥ |
| అజమనుచు మేషమునకుఁ బేరు నిజకోరిక లేలా గీడేరు అజుఁడని వాగీశ్వరునికిఁ బేరు విజయము గల్గును త్యాగరాజ నుతుని ॥తె॥ |