| బిలహరి - ఝంప |
| పల్లవి: |
| తొలి జన్మమున జేయు దుడుకు దెలిసెను రామ ॥తొలి॥ |
| అను పల్లవి: |
| ఫలమేమొ యరచేతి వంటి కద్దము వలె నా ॥తొలి॥ |
| చరణము(లు): |
రాగి పయిరుల చెంత రమ్యమౌ వరి మొలక
రాజిల్ల నేర్చునటరా
నాగశయన త్యాగరాజ పాపముతోను
నామ పుణ్యము చెలగునా ॥తొలి॥ |
AndhraBharati AMdhra bhArati - tyAgarAja kIrtanalu - toli janmamuna jeeyu duDuku delisenu raama ( telugu andhra )