| కీర్తనలు | త్యాగరాజు | తొలి నేఁ జేసిన పూజాఫలము |
| శుద్ధబంగాళ - ఆది |
| పల్లవి: |
| తొలి నేఁ జేసిన పూజాఫలము దెలిసెను నాపాలి దైవమా ॥తొ॥ |
| అను పల్లవి: |
| పలువిధములనేఁ దలఁచి కరగఁగాఁ బలుకక నీవటు నేనిటు కాఁగ ॥తొ॥ |
| చరణము(లు): |
| సరివారలలోఁ జౌకఁ జేసి ఉ దరపోషకులను బొరుగునఁ జేసి హరిదాస రహిత పురమున వేసి దరిజూపకుండఁగ త్యాగరాజార్చిత ॥తొ॥ |