| కీర్తనలు | త్యాగరాజు | దరిని తెలిసికొంటి త్రిపుర సుం |
| శుద్ధసావేరి - ఆది |
| పల్లవి: |
| దరిని తెలిసికొంటి త్రిపుర సుం దరి నిన్నే శరణంటి ద.. |
| అను పల్లవి: |
| మరుని జనకుడైన మా దశరథ కు మారుని సోదరి దయాపరి మోక్ష ద.. |
| చరణము(లు): |
| అంబ త్రిజగదీశ్వరీ ముఖజితవిధు బింబయాదిపురమున నెలకొన్న కన కాంబరి నమ్మినవారికభీష్ట వ రంబు లొసఁగు దీనలోకరక్షకి అంబుజభవ పురుహూత సనందన తుంబురునారదులందరు నీదు ప దంబునుగోరి సదా నిత్యానం దాంబుధిలో నోలలాడుచుండే ద.. |
| మహదైశ్వర్యమొసఁగి తొలికర్మ గహనమును గొట్టి బ్రోచు తల్లి గుహగజముఖజనని యరుణపంకే రుహనయన యోగిహృత్సదన తుహినాచలతనయ నీ చక్కని మహిమాతిశయమ్ములచేతను యీ మహిలో మునిగణములు ప్రకృతి వి రహితులై నిత్యానందులైన ద.. |
| రాజితమణిగణభూషిణి మదగజ రాజగమన లోకశంకరి దనుజ రాజగురుని వాసరసేవ తన కే జన్మఫలమో కనుగొంటిని ఆజన్మము పెద్దలు తమ మదిలో నీ జపమే ముక్తిమార్గమనుకొన రాజశేఖరుండగు శ్రీ త్యాగ రాజమనోహరి గౌరి పరాత్పరి ద.. |