| కీర్తనలు | త్యాగరాజు | దేవాది దేవ, సదాశివ, దిననాథ సుధాకర దహన నయన |
| సింధునామ క్రియ - దేశాది |
| పల్లవి: |
| దేవాది దేవ, సదాశివ, దిననాథ సుధాకర దహన నయన ॥దేవాది॥ |
| అను పల్లవి: |
| దేవేశ! పితామహ మృగ్య శమా ది గుణాభరణ గౌరీ రమణ ॥దేవాది॥ |
| చరణము(లు): |
| భవచంద్ర కళాధర నీలగళ భానుకోటి సంకాశ శ్రీశనుత తవ పాద భక్తిం దేహి దీనబంధో దరహాస వదన త్యాగరాజనుత ॥దేవాది॥ |