| కీర్తనలు | త్యాగరాజు | నడచి నడచి చూచే రయోధ్యానగరము గానరే |
| ఖరహరప్రియ - ఆది |
| పల్లవి: |
| నడచి నడచి చూచే రయోధ్యానగరము గానరే న.. |
| అను పల్లవి: |
| పుడమిసుతసహాయుఁడై చెలంగే పూర్ణుని ఆత్మారాముని గూడ న.. |
| చరణము(లు): |
| అట్టె కనులఁగూర్చి తెఱచి సూత్రమునఁ బట్టి వెలికి వేసధారులై పుట్టుచావులేని తావు తెలియక పొగడేరు త్యాగరాజవినుతుని న.. |