| కీర్తనలు | త్యాగరాజు | నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ |
| మోహన - దేశాది |
| పల్లవి: |
| నను పాలింప నడచి వచ్చితివో నాప్రాణనాథ ॥న॥ |
| అను పల్లవి: |
| వనజనయన మోమును జూచుట జీ వనమని నెనరున మనసు మర్మము దెలిసి ॥న॥ |
| చరణము(లు): |
| సురపతి నీలమణినిభ తనువుతో నురమున ముత్యపు సరుల చయముతో కరమున శర కోదండ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత ॥న॥ |