| కీర్తనలు | త్యాగరాజు | నమ్మక నే మోసబోదునటరా నటరాజవినుత |
| అసావేరి - రూపకము |
| పల్లవి: |
| నమ్మక నే మోసబోదునటరా నటరాజవినుత ॥న॥ |
| చరణము(లు): |
| దుర్విషయమ్ములు మనసున దూరక చేసే నిను నెఱ ॥న॥ |
| ధన తనయ కళత్రాదులు తమదని బుద్ధీయని నిను ॥న॥ |
| ఇంద్రియముల కాహ్లాద మిచ్చే రూపముగల నిను ॥న॥ |
| బొమ్మరిండ్లుగాని నెఱ నమ్మకు భవమును యనునిను ॥న॥ |
| నెమ్మదిలేని జనన మరణమ్ములఁ దొలగించే నిను ॥న॥ |
| రఘుకుల రత్నమా త్యాగరాజార్చిత పదయుగ నిను ॥న॥ |