| కీర్తనలు | త్యాగరాజు | నమ్మి వచ్చిన నన్ను నయముగఁ బ్రోవవే నిను |
| కల్యాణి - రూపక |
| పల్లవి: |
| నమ్మి వచ్చిన నన్ను నయముగఁ బ్రోవవే నిను న.. |
| అను పల్లవి: |
| కొమ్మని వరముల నొసఁగే కోవూరి సుందరేశ న.. |
| చరణము(లు): |
| వేదపురాణాగమ శాస్త్రాదులు గుమిగూడి పాదములను గనఁజాలక బతిమాలి వేడ నాదరూప శ్రీ సౌందర్య నాయకీపతే వేద వాదరహిత త్యాగరాజవరద సుందరేశ్వర నిను |