| కీర్తనలు | త్యాగరాజు | నరసింహా! ననుఁ బ్రోవవే శ్రీ లక్ష్మీ |
| బిలహరి - త్రిపుట |
| పల్లవి: |
| నరసింహా! ననుఁ బ్రోవవే శ్రీ లక్ష్మీ న.. |
| అను పల్లవి: |
| కొఱమాలిన నరులఁ గొనియాడను నేను పరమపావన! నా పాలి శ్రీ లక్ష్మీ న.. |
| చరణము(లు): |
| నీదు భక్తాగ్రేసరుఁడు ప్ర హ్లాదుఁ డపుడొక కనక కశ్యపు వాదుకోర్వక నిన్ను శరణని యాదుకోమన కాచినావు |
| ఎందుకని సైరింతు నీ మన సందు తెలియనిదేది? లోకుల నిందకోర్వక నిన్నుఁ గోరి నందు కెంతని కరుణఁ జూతువో? న.. |
| నీ జపము నీ స్మరణ నీ పద పూజ నీ వారి చెలిమి యొసఁగి రాజిగ దయచేయు త్యాగ రాజసన్నుత! తరముగాదు న.. |