| కీర్తనలు | త్యాగరాజు | నా పాలి శ్రీరామ భూపాలకస్తోమ కాపాడసమయము నీ పాదము లీర |
| శంకరాభరణము - ఆది |
| నా పాలి శ్రీరామ భూపాలకస్తోమ |
| కాపాడసమయము నీ పాదము లీర ॥నా॥ |
| భళినభళి భక్తుల పూజాఫలము నీ వనుకొంటి |
| నళినలోచన నీకు నలుగుబెట్టేరా ॥నా॥ |
| కోటిమన్మథులైన సాటిగా నీ సొగసు |
| నాటియున్నది మదిని మేటి శ్రీరామ ॥నా॥ |
| తొలిపూజాఫలమేమో కలిగె నీ పదసేవ |
| నలువకైనను నిన్నుఁ దెలియఁగా తరమా ॥నా॥ |
| పతితపావన నీవు పాలించకుంటేను |
| గతి మాకెవరు మమ్ము గ్రక్కున బ్రోవు ॥నా॥ |
| కోరి నీ పదసేవ సారెకు సేయను దలఁచి |
| మా రమణ నాలోనే మరులుకొన్నాను ॥నా॥ |
| నిరుపేద కబ్బిన నిధిరీతి దొరికితివి |
| వర త్యాగరాజునికి వరద మ్రొక్కేరా ॥నా॥ |