| కీర్తనలు | త్యాగరాజు | నాడాడిన మాట నేడు తప్పవలదు నా తండ్రి శ్రీరామ |
| జనరంజని - చాపు |
| పల్లవి: |
| నాడాడిన మాట నేడు తప్పవలదు నా తండ్రి శ్రీరామ ॥నా॥ |
| అను పల్లవి: |
| ఏడాది నాడుగ యెడబాయనివాని పోడిమిగఁ గాపాడుదునని చిన్న ॥నా॥ |
| చరణము(లు): |
| తలకు వచ్చిన బాధ తలపాగకుఁ జేతు వలచి నమ్మిన వాని వలలోనఁ దగులుదు ఇల భక్తి సాగర మీదఁ జేతునని తలఁబోసి పల్కితివే త్యాగరాజార్చిత ॥నా॥ |