| కీర్తనలు | త్యాగరాజు | నాద సుధారసం బిలను నరాకృతాయ మనసా |
| ఆరభి - రూపకము |
| పల్లవి: |
| నాద సుధారసం బిలను నరాకృతాయ మనసా ॥నా॥ |
| అను పల్లవి: |
| వేదపురాణాగమ శాస్త్రాదుల కాధారమౌ ॥నా॥ |
| చరణము(లు): |
| స్వరములు యాఱొక ఘంటలు వరరాగము కోదండము - మే దుర నయ దేశ్యము త్రిగుణము నిరతగతి శరమురా ॥నా॥ |
| సరస సంగతి సందర్భముగల గిరములురా ధర భజనే భాగ్యమురా త్యాగరాజు సేవించు ॥నా॥ |