| కీర్తనలు | త్యాగరాజు | నామకుసుమములచేఁ పూజించే నరజన్మమే జన్మము మనసా |
| శ్రీ - దేశాది |
| పల్లవి: |
| నామకుసుమములచేఁ పూజించే నరజన్మమే జన్మము మనసా ॥నామ॥ |
| అను పల్లవి: |
| శ్రీమన్మానస కనక పీఠమున చెలగఁ జేసికొని వరశివరామ ॥నామ॥ |
| చరణము(లు): |
| నాద స్వరమున వర నవరత్నపు వేదికపై సకల లీలా వి నోదుని, పరమాత్ముని, శ్రీరాముని పాదములను త్యాగరాజ హృద్భూషణుని ॥నామ॥ |