| కీర్తనలు | త్యాగరాజు | నారద గురుసామి యికనైన నన్నాదరింపవేమి? ఈ కఱవేమి? |
| దర్బారు - ఆది |
| పల్లవి: |
| నారద గురుసామి యికనైన న న్నాదరింపవేమి? ఈ కఱవేమి? ॥నారద॥ |
| అను పల్లవి: |
| సారెకు సంగీత యోగ నైగమ పారంగతుఁడైన పరమ పావన! ॥నారద॥ |
| చరణము(లు): |
| ఇతిహాస పురాణాగమ చరితము - లెవరివల్లఁ గలిగె? పతిని దానమివ్వ బుద్ధి సత్య - భామ కెటులఁ గలిగె? ద్యుతిజిత శరదాభ్ర! నిను వినా, ముని యతుల కెవరు గలిగె? క్షితిని, త్యాగరాజ వినుత! న మ్మితి చింత దీర్చి ప్రహ్లాదుని బ్రోచిన ॥నారద॥ |