| కీర్తనలు | త్యాగరాజు | నిజమర్మములను దెలిసిన వారిని |
| ఉమాభరణము - ఆది |
| పల్లవి: |
| నిజమర్మములను దెలిసిన వారిని నీ వలయించే దేమొకో? ॥ని॥ |
| అను పల్లవి: |
| అజ గజ రక్షక గజ చర్మాంబ రాది గౌణ భేదముల లీల గల్గఁ జేసిన నీ ॥ని॥ |
| చరణము(లు): |
| శ్రుతి శాస్త్ర పురాణ వివాది ష ణ్మత నిష్ఠుల నామ పరాదుల క్షితి పతులంగ మతులుగా జేసిన క్షేమ త్యాగరాజనుత శ్రీమనోహర నీ ॥ని॥ |